డ్యాన్స్‌తో అదరగొడుతున్న అదాశర్మ

నాయిక అదాశర్మ సామాజిక మాధ్యమాల్లో ఎంత హుషారుగా ఉంటుందో తెలిసిన విషయమే. రోజుకో పోస్ట్‌ పెడుతూ అభిమానుల్ని అలరిస్తుంటుందీ భామ. తాజాగా డ్యాన్స్‌ చేసిన ఓ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో ఉంచింది. పాప్‌ గీతానికి తగినట్టుగా ఆమె చేసిన నృత్యం నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటుంది. ‘సూపర్‌ డ్యాన్స్‌, వావ్‌’ అంటూ కొందరు కామెంట్లు పెడుతున్నారు. గతంలో వైవిధ్యమైన వేషాలు వేసి, పియోనో వాయించి అదాలో ఇన్ని కళలున్నాయా అనేంతగా ఆశ్యర్యంలో పడేసింది. ‘హార్ట్‌ ఎటాక్‌’, ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ చిత్రాల్లో మెరిసి తెలుగు ప్రేక్షకుల్ని అలరించింది.



View this post on Instagram

Dance is....

A post shared by Adah Sharma (@adah_ki_adah) on



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.