జనవరి 19 నుంచి ‘ఆదిపురుష్‌’ షూటింగ్‌ ప్రారంభం!

‘బాహుబలి’ నటుడు ప్రభాస్‌ నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘ఆదిపురుష్’‌. ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో లంకేశ్‌గా బాలీవుడ్‌ కథానాయకుడు సైఫ్‌ అలీఖాన్‌ నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన అప్‌డేట్‌ ఒకటి బయటకు వచ్చింది. చిత్రం జనవరి 19 నుంచి షూటింగ్‌ మొదలుపెట్టడానికి షెడ్యూల్ ఖరారు చేసింది. ముంబైలోని ఓ ప్రముఖ స్టూడియోలో ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్‌ ఏర్పాట్లు సైతం చకచకా జరిగిపోతున్నాయి. అయితే సినిమా షూటింగ్‌ ఎక్కువ భాగం ఈ స్టూడియోలోనే జరుపుకోనుందట. చిత్రానికి హాలీవుడ్ స్థాయి సాంకేతిక నిపుణులు పనిచేయనున్నారు. ఇక సీత పాత్రలో క్రితి ససన్‌ పేరు బాగా ప్రచారంలో ఉంది. అయితే అధికారికంగా ఎక్కడా ప్రకటించలేదు చిత్రబృందం. ఆ మధ్య రావణుడి గురించి సైఫ్‌ అలీఖాన్‌ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపడంతో క్షమాపణలు సైతం చెప్పారు. తాజాగా ఆ మాటలపై దర్శకుడు ఓం రౌత్ సైతం సైఫ్‌వి సొంత ఆలోచనలు కావచ్చు అంటూనే సైఫ్‌ చాలా వాటిపై దర్శకుడు ఓం రౌత్‌ ఇటీవల ఓ మీడియాతో మాట్లాడుతూ.. సైఫ్‌ ప్రతికూల మాటల పట్ల నాకు అసంతృప్తిగానే ఉంది. అయితే నేను ఆయనను సమర్థిస్తాను. సైఫ్‌ ఏమైనా తన సొంత ఆలోచనలను కలిగి ఉంటాడని భావిస్తున్నా. భూషణ్‌ కుమార్‌ సమర్పణలో గుల్షన్‌ కుమార్‌, టీ-సీరీస్‌ ఫిల్మ్ పతాకంపై కిషన్‌ కుమార్‌, ఓం రావత్‌, ప్రసాద్‌ సుతార్‌ రాజేష్‌ నాయర్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చిత్రాన్ని వచ్చే ఏడాది ఆగస్టు 11న విడుదల చేయనున్నారు. 



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.