భాగ్యరాజ్‌ రీమేక్‌ చిత్రంలో ఐశ్వర్య రాజేష్‌!

ప్రముఖ తమిళ దర్శకుడు భాగ్యరాజ్‌ దర్శకత్వం వహించిన నాటి బ్లాక్ బస్టర్‌ చిత్రం ‘ముంతనై ముడిచు’. ప్రస్తుతం అదే చిత్రాన్ని రీమేక్‌ చేస్తున్నారు. ఇందులో కథానాయికగా ఐశ్వర్య రాజేష్‌ నటిస్తోంది. శశి కుమార్‌ కథానాయకుడిగా నటిస్తున్నారు. ఈ సందర్భంగా ఐశ్వర్య రాజేష్‌ ట్విట్టర్‌ వేదికగా స్పందిస్తూ..‘‘తమిళ చిత్రసీమలో మైలురాయిగా చెప్పుకోనే సినిమాల్లో ‘ముంతనై ముడిచు’ ఒకటి. అలాంటిది ఇప్పుడు అదే చిత్రానికి రీమేక్‌గా వస్తోన్న చిత్రంలో నేను భాగమైనందుకు చాలా సంతోషంగా ఉందంటూ..’’ పేర్కొంది. జేఎస్‌బీ ఫిల్మ్స్ స్టూడియో పతాకంపై సతీష్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. చిత్రం వచ్చే ఏడాదిలో విడుదల కానుంది. ఐశ్వర్య రాజేష్ ఈ ఏడాదిలో తెలుగు తెరపైకి వచ్చిన ‘వరల్డ్ ఫేమస్‌ లవర్’‌ చిత్రంలో విజయ దేవరకొండతో కలిసి నటించింది. ప్రస్తుతం నానితో కలిసి ‘టక్‌జగదీష్’‌లోనూ చేస్తుంది. 



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.