ఆర్‌ఎక్స్ 100 దర్శకుడికి కరోనా పాజిటివ్‌

తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం కరోనా వైరస్‌ కంగారు పెడుతోంది. తాజాగా ఆర్ఎక్స్ -100 సినిమా దర్శకుడు అజయ్‌ భూపతికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇదే విషయాన్ని దర్శకుడు అజయ్‌ ట్విట్టర్లో తెలిపారు. అదేమంటే త్వరలో వస్తా..ప్లాస్మా ఇస్తా అంటూ తనదైన రీతిలో ట్వీట్‌లో పేర్కొన్నారు. ఆర్ఎక్స్ 100 సినిమాతో చిత్రసీమలో తనకంటూ ప్రత్యేకతను సంపాదించుకున్న దర్శకుడు అజయ్‌ భూపతి. ప్రస్తుతం మహాసముద్రం అనే చిత్రాన్ని తెరకెక్కించే పనిలో ఉన్నారు. ఇందులో కథనాయకుడిగా శర్వానంద్‌ నటిస్తున్నారు. 100’ తరహాలోనే సాగే ఓ విభిన్న కథాంశంతో ఈ చిత్రం రూపొందుతోంది. వైజాగ్‌ నేపథ్యంగా సాగుతుంది. ఇప్పటికే తెలుగు సినీ పరిశ్రమలో పలు దర్శకనిర్మాతలకు కరోనా సోకిన సంగతి తెలిసిందే. దర్శకుడు రాజమౌళికి కరోనా నుంచి కోలుకున్నట్లు నిన్ననే ట్వీట్‌ చేశారు.\Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.