వేడుకలు జరపొద్దు: అఖిల్‌

కరోనా నేపథ్యంలో తన పుట్టిన రోజు వేడుకలు జరపొద్దని యువ కథానాయకుడు అక్కినేని అఖిల్‌ అభిమానుల్ని కోరాడు. తన నటిస్తున్న చిత్రానికి సంబంధించి ఎలాంటి అప్‌డేట్‌ ఇవ్వట్లేదని స్పష్టం చేశాడు. ట్విటర్‌ వేదికగా ఈ విషయాలు పంచుకున్నాడు అఖిల్‌. ‘ఈ సమయంలో కేకులు కోయడం, వేడుకలు జరపడం సరైంది కాదు. దయచేసి ఇంట్లోనే ఉండండి. జాగ్రత్తగా ఉండండి. నా కొత్త చిత్రం పోస్టర్, టీజర్‌ విడుదల చేద్దామని దర్శకనిర్మాతలు అడిగినా నేనే వద్దని చెప్పాను. మీ కోసం, మీ వల్ల సినిమా చేస్తున్నాం. మీ బలం, ధైర్యం ఇప్పుడు మీ కుటుంబాలకు అవసరం. వాళ్లతోనే ఉండండి. పుట్టిన సందర్భంగా కుటుంబంతో దిగిన ఓ ఫొటో మీతో పంచుకుంటాను. మీరు కూడా మీ కుటుంబంతో ఫొటో దిగి నా కోసం పోస్ట్‌ చేయండి. కరోనాను అంతం చేసేందుకు కలిసి పోరాడదాం’ అని పిలుపునిచ్చాడు. బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వంలో ‘మోస్ట్‌ఎలిబిబుల్‌ బ్యాచిలర్‌’ సినిమాలో నటిస్తున్నాడు అఖిల్‌. పూజా హెగ్డే నాయిక.




Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.