అక్కినేని అఖిల్ సినిమాలతో పాటు కొన్ని అదనపు విషయాలను సైతం నేర్చుకున్నారు. తాజాగా ఆయన గుర్రపు స్వారి చేస్తున్న వీడియో ఒకటి తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. దినచర్యను గిజెల్తో (గుర్రం పేరు) స్వారీతో ప్రారంభించడం బాగుంటుందని ఇన్స్టాలో పేర్కొన్నారు. ఆ వీడియోలో అఖిల్ గుర్రాన్ని చాలా వేగంగా పరిగెత్తిన్నట్లు కనిపిస్తోంది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరలౌతోంది. ప్రస్తుతం బొమ్మరిల్లు దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’ సినిమాలో కథానాయకుడిగా నటిస్తున్నారు. ఇందులో పూజాహెగ్డే కథానాయిక. చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నారు.