అందరికీ ఆదివారం ఎంతో ప్రత్యేకం. సోమవారం నుంచి శనివారం వరకు పడిన కష్టాన్ని ఆదివారం ఒక్కటే తీర్చేస్తుంది. అందుకే ఆదివారం వచ్చిందంటే చాలు హద్దులు చెరిపేసి ఆనందంలో మునిగిపోతుంటాం. ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఎంజాయ్ చేస్తుంటారు. యువ కథానాయకుడు అఖిల్ ఈ ఆదివారం తన గుర్రం గిజెల్తో ప్రయాణం సాగించాడు. ఆ అనుభూతిని ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. ‘ఆదివారం నా ప్రియమైన గిజెల్తో స్వారీ చేశాను. నన్ను నా కాలి అంచున నిలిపింది. అదే సమయంలో విశ్రాంతతను ఇచ్చింది.ఇదంతా ఓ చికిత్సా విధానంలా అనిపించింది. దీని గురించి మాటల్లో చెప్పలేను. మరో వారంపాటు ఫ్రెష్‌గా ఉండేందుకు తగిన శక్తిని అందించింద’ని తెలిపాడు. సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’లో నటిస్తున్నాడు. పూజా హెగ్డే నాయిక. మరోవైపు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ చిత్రం చేయబోతున్నాడు.