పేరుకే తెలుగు హీరో అయినా యావత్ దేశం మొత్తం తన పేరును తెలుసుకునేటట్లు చేశాడు హీరో అల్లు అర్జున్. తాజాగా ఇంటర్నెట్ మూవీ డేటా బేస్ సంస్థ విడుదల చేసిన కొన్ని సినిమాల లిస్టులో అల్లు అర్జున్ నటించిన ‘అల వైకుంఠపురములో’ చిత్రం చోటు దక్కించుకుంది. మాటల రచయిత దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరపైకి వచ్చిన చిత్రం ఈ యేడాదిలో ఘనమైన విజయాన్ని సాధంచింది. ముఖ్యంగా అల్లు అర్జున్ - పూజాహెగ్డేల ‘‘బుట్టబొమ్మా బుట్టబొమ్మా’’ పాట ఎంత పెద్ద క్రేజ్ సంపాదించిందో అందరికి తెలిసిందే. ఐఎమ్‌డీబీ ప్రముఖ అన్ని చిత్రసీమకు చెందిన ట్రైలర్స్ ని ఉంచుతోంది. అయితే తాజాగా ఆ సినిమాలకు ట్రైలర్స్ సంబంధించి ఎక్కువ ప్రజాదరణ పొందిన టాప్ 20 చిత్రాల్లో మన తెలుగు సినిమా ‘అల వైకుంఠపురుములో’ ఒకటి. అల్లు అర్జున్ నటించిన ఈ చిత్రం ఆ టాప్ జాబితాలో చోటు దక్కించుకుంది. బాలీవుడ్ నుంచి టైగర్ ష్రాఫ్ నటించిన ‘బాఘీ3’ మాత్రమే ఉంది. అల్లు అర్జున్ స్టైలీస్ స్టార్‌గానే కాదు, ఫ్యాషన్‌లోనూ ముందుంటారు. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ చిత్రంలో కథానాయకుడిగా నటిస్తున్నారు.