‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ప్రతినాయిక విచ్చేసింది

రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘రౌద్రం రణం రుధిరం’ (ఆర్‌.ఆర్‌.ఆర్‌) చిత్రంలో బాలీవుడ్‌తోపాటు హాలీవుడ్‌ ప్రముఖులు నటిస్తున్న సంగతి తెలిసిందే. ఐరీష్‌ అందాల భామ అలిసన్‌ డూడి ప్రతినాయికగా లేడీ స్కాట్‌ పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్‌లో పాల్గొనేందుకు నవంబరు 1న ఇండియా వచ్చారు. ఈ విషయాన్ని తానే స్వయంగా ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. లేడీ స్కాట్‌ ఇండియా వస్తుందంటూ రాసుకొచ్చారు. మరి అలిసన్‌ ఎప్పటి నుంచి షూట్‌లో జాయిన్‌ అవుతారో తెలియాల్సి ఉంది. చరణ్‌ అల్లూరి సీతారామ రాజుగా నటిస్తుండగా, ఎన్టీఆర్‌ కొమరం భీం పాత్రల్లో నటిస్తున్న విషయం విధితమే. అలియా భట్‌, ఒలివియా మోరిస్‌ కథానాయికలు. అజయ్‌ దేవగణ్‌, శ్రియ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నారు.


View this post on Instagram

Lady Scott heading to India 🎬 🔥🌊 #rrrmovie #rrr #ssrajamouli #film @ssrajamouli

A post shared by Alison Doody (@alison_doody) on



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.