పూరి మీ పోడ్‌కాస్ట్‌లు అద్భుతం: అల్లు అర్జున్‌

ప్రముఖ సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన చిత్రాలతోనే కాదు తన మాటలతోనూ ఎదుటివారి మనసులను తట్టిలేపుతున్నారు. పూరి జగన్నాథ్‌ గత కొంతకాలంగా పోడ్‌కాస్ట్‌ల ద్వారా ఆడియో రూపంలో మంచి మంచి విషయాలు చెబుతున్నారు. స్ర్తీల గురించి వారి మనస్తత్వాలు, వారి గొప్పతనం గురించి వివరించారు. అంతేకాదు ఎవరైతే ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటున్నారో అలాంటి వారికి పూరి చెబుతున్న మాటలు మనోధైర్యాన్నిస్తున్నాయి. తాజాగా అల్లు అర్జున్‌ పూరి చెప్పిన విషయాలను ప్రశంసిస్తూ ట్విట్‌ చేశారు. ‘‘పూరి గారు ఏమీ అద్భుతమైన విషయాలు చెబుతున్నారు పోడ్‌కాస్ట్ లో. వ్యక్తిగతమైన విషయాలపై మీరు చెప్పే అభిప్రాయాలు అమేజింగ్‌. మీకు నా హృదయపూర్వకమైన ప్రేమను తెలియజేస్తున్నా. మీరు ఇంకా ఇలాంటి అందమైన విషయాలను చెప్పాలని ఆశిస్తూ.. ప్రేమతో మీ బన్నీ..’’అంటూ పేర్కొన్నారు. బన్నీ ట్విట్‌పై స్పందించిన పూరి..‘‘నేను మీరు ట్విట్‌ చేసిన విషయాలను చదివినప్పుడు ఆనందంతో ఉప్పొంగిపోయా. మీలాంటి యవనటుడి నుంచి నాకు వచ్చిన పెద్ద అభినందన. ఈ రాత్రి మీపై అభిమానంతో ఒక అదనపు పెగ్‌తో చీర్స్ వైన్‌ గ్లాస్‌ లవ్‌ యు అంటూ’’ పేర్కొన్నారు. పూరి జగన్నాథ్ అలనాటి ప్రముఖ రచయిత చలం నవలలు బాగా చదివానని ఇది వరకే చెప్పారు. అందుకే ఆడవాళ్లను మనసుని అంత బాగా అర్ధం చేసుకొంటున్నాడని కొంతమంది సినీ జనాలు చెప్పుకుంటున్నారు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.