ప్రియుడ్ని పెళ్లాడిన అమలాపాల్‌

వైవిధ్యమైన పాత్రలతో దక్షిణాది ప్రేక్షకులకు దగ్గరయిన నటి అమలాపాల్‌.. వివాహ బంధంతో కొత్త జీవితాన్ని ప్రారంభించింది. ఆమె కొంత కాలంగా ముంబయికి చెందిన గాయకుడు భవిందర్‌ సింగ్‌తో ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే అతని పేరును ఆమె ఎక్కడా బయటపెట్టనప్పటికీ.. తన జీవితంలోకి ఓ వ్యక్తి వచ్చాడని ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఇప్పుడా వ్యక్తితోనే ఇరు కుటుంబ సభ్యుల అంగీకారంతో వివాహమాడినట్లు సమాచారం అందుతోంది. అయితే అమలాపాల్‌.. భవిందర్‌ల పెళ్లి ఎప్పుడు ఎక్కడ జరిగిందన్న దానిపై ఇరు వర్గాల కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ, ప్రస్తుతం వీళ్లిద్దరి వివాహ చిత్రాలు నెట్టింట సందడి చేస్తున్నాయి. ఈ ఫొటోలను బట్టీ చూస్తే.. వీరి వివాహం సిక్కు సంప్రదాయ పద్ధతిలో జరిగినట్లు తెలుస్తోంది. అమలాపాల్‌కు ఇది రెండో వివాహం. ఆమె 2014లో తమిళ దర్శకుడు ఎ.ఎల్‌.విజయ్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. కానీ, కొన్ని కారణాల వల్ల వీళ్లిద్దరూ 2017లో విడాకులు తీసుకున్నారు.





Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.