అమలాపాల్‌ మరో నగ్న సాహసం..

అమలాపాల్‌.. ఈ ఏడాది దక్షిణాదిలోనే కాక ఉత్తరాదిలోనూ ఎక్కువగా అందరి దృష్టినీ ఆకర్షించిన పేరు. ఆమె ‘ఆడై’ చిత్రం కోసం ఇప్పటి వరకు ఏ నటీ చేయని సాహసాన్ని చేసి చూపించి సినీప్రియులతో ఔరా అనిపించుకుంది. ఒంటిపై నూలు పోగు లేకుండా ఆ చిత్రంలో నటించి అందరినీ మెప్పించింది. ఈ చిత్రం తెలుగులో ‘ఆమె’ పేరుతో విడుదల కాగా ఇక్కడా మంచి విజయాన్నే అందుకుంది. అయితే తాజాగా ఈ భామ మరోసారి ‘ఆమె’ తరహా సాహసాన్ని చేసి చూపించి నెట్టింట సెగలు రేపింది. తాజాగా ఈ భామ నగ్నంగా టబ్‌ బాత్‌ చేస్తున్న ఓ ఫొటోను నెట్టింట అప్‌లోడ్‌ చేసి కుర్రకారు గుండెల్లో గుబులు రేపింది. ప్రస్తుతం అమలాపాల్‌ ఇండోనేషియాలోని బాలిలో విహారయాత్రను ఆస్వాదిస్తోంది. అక్కడి ఆహ్లాదకరమైన అడవుల మధ్య ఉన్న ఓ హోటల్‌లో బస చేసిన ఈ అమ్మడు.. అక్కడి గదిలోనే ఓ సెలయేరు పక్కన బాత్‌ టబ్‌లో పూల మధ్య నగ్నంగా జలకాలాడుతూ దర్శనమిచ్చింది. ముఖ్యంగా ఈ చిత్రంలో అమలా వీపుపై ఉన్న పెద్ద టాటూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట తెగ సందడి చేస్తోంది. ఇక ఆమె సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆమె చేతిలో ‘లస్ట్‌ స్టోరీస్‌’ వెబ్‌ సిరీస్‌తో పాటు ‘ఆడు జీవితం’, ‘కాడవర్‌’ అనే తమిళ చిత్రాలతో బిజీగా ఉన్నారు.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.