ప్రభాస్‌ చిత్రంలో అమితాబ్‌

‘బాహుబలి’ కథానాయకుడు ప్రభాస్‌,  నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై నిర్మితమయ్యే ఈ చిత్రంలో బాలీవుడ్‌ అగ్రనటుడు అమితాబ్‌ బచ్చన్‌ నటించనున్నారు. ఇదే విషయాన్ని నిర్మాణ సంస్థ తన ట్విట్టర్లో పేర్కొంది. ‘‘బిలియన్‌ భారతీయుల అభిమాన నటుడికి సగర్వగంగా స్వాగతం పలుకుతున్నాం. మా యీ ప్రయాణంలో అబితాబ్‌ బచ్చన్‌ ఉండటం గొప్పవరం అంటూ..’’ పేర్కొన్నారు. ఈ సందర్భంగా దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ తన ట్విట్టర్లో..‘‘అమితాబ్‌ బచ్చన్‌ మా చిత్రంలో నటించేందుకు ఒప్పుకున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది. ఆయన పాత్ర సినిమాలో చివరి వరకు ఉంటుంది. ఈ పాత్రకు ఆయనైతేనే న్యాయం చేస్తారనిపించిందని’’ వెల్లడించారు. ఇక వైజయంతీ మూవీస్‌ అధినేత అశ్వినీదత్‌, అమితాబ్‌ గురించి మాట్లాడుతూ..‘‘నాటి నటుడు స్వర్గీయ ఎన్‌.టి.ఆర్‌కి అమితాబ్‌ అంటే ఏంతో ఇష్టం. హిందీలో విజయవంతమైన హిట్‌ రీమేక్స్ చిత్రాల్లోనూ నాటి ఎన్టీఆర్‌ నటించారు. రామకృష్ణ థియేటర్లో ‘షోలే’ చిత్రం ఆడుతున్నపుడు ఎన్టీఆర్‌గారు - నేను బోలెడన్నీ షోలు చూశాం. వైజయంతి మూవీస్‌ పతాకంపై ఇంతకాలం తరువాత మళ్లీ ఆయన మా సంస్థలో తెరకెక్కనున్న చిత్రంలో అమితాబ్‌  నటిస్తుండటం చాలా ఆనందంగా ఉందని..’’ తెలిపారు. పాన్‌ ఇండియా చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాలో కథనాయికగా బాలీవుడ్ నటి దీపికా పదుకొణె నటిస్తోంది. చిత్రం వచ్చే ఏడాది మొదటి మాసంలోనే సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. చిత్రాన్ని 2022లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందకు సన్నాహాలు చేస్తున్నారు.Welcoming with a full heart, the pride of a billion Indians. The Amitabh Bachchan. Our journey just got BIG-ger!https://t.co/bmG2GXBODh#NamaskaramBigB @SrBachchan ??#Prabhas @deepikapadukone @nagashwin7 @AshwiniDuttCh@SwapnaDuttCh @VyjayanthiFilms


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.