పుస్తకాలే నా నేస్తాలు: అను ఇమ్మాన్యుయేల్‌

‘మజ్ను’, ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’, ‘నా పేరు సూర్య’ లాంటి చిత్రాల్లో నటించి మెప్పించిన చిన్నది అను ఇమ్మాన్యుయేల్. అందరిలాగే లాక్‌డౌన్‌ కాలంలో షూటింగ్‌లు లేక ఖాళీగా ఉండడం చేత అను కూడా తనకు ఇష్టమైన కార్యకలాపాల్లో మునిగోపోయింది. అయితే అను మాత్రం పుస్తకాలు చదివేస్తూ..పుస్తకాల పురుగ్గా మారిపోయింది. తాజాగా ఈ అమ్మడు పుస్తకాల పఠనం గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో తన చదివిన పుస్తకాల ఫోటోను పెట్టింది. ‘‘ఈ సమయంలో నేను ఆనందిస్తున్న అన్ని విషయాల్లో కెల్లా నాకు కచ్చితమైనది పుస్తక పఠనం. ఈ అలవాటు నన్ను కొంతకాలం పాటు వేరే ప్రపంచాన్ని పరిచయం చేసినట్లైంది. నిజంగా నేను పుస్తకాల షూటింగ్‌లోమునిగిపోయా. ఇలాంటి విపత్కరమైన పరిస్థితుల్లో చేయగలిగే ఉత్తమమైన పని చదవడం. ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో బోలెడు ఆనందాన్ని వెతుక్కోండి..’’అంటూ పేర్కొంది. విజయ్‌ దేవరకొండ నటించిన ‘గీతగోవిందం’ చిత్రంలో అతిధి పాత్రలో కనిపించింది. నాగచైతన్యతో కలిసి ‘శైలజారెడ్డి అల్లుడు’ చిత్రంలో రమ్యకృష్ణ కూతరు అను రెడ్డిగా నటించి అలరించింది. ప్రస్తుతం తెలుగులో బెల్లంకొండ హీరోగా నటిస్తున్న ‘అల్లుడు అదుర్స్’ చిత్రంలో నటిస్తోంది. సంతోష్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీం అందిస్తున్నాడు.

View this post on Instagram

A post shared by Anu Emmanuel (@anuemmanuel) on



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.