అను పోస్ట్‌ అర్థం.. ఆమె ప్రేమలో ఉందనా??

‘ప్రేమమ్‌’ చిత్రంతో సినీ ప్రయాణం మొదలు పెట్టిన అనుపమ పరమేశ్వరన్‌.. ఈ నాలుగేళ్ల ప్రయాణంలో దక్షిణాదిలోని నాలుగు భాషల్లో నటించే అవకాశం దక్కించుకోని సత్తా చాటింది. ఆమె చేసిన ప్రతి చోటా తన అందం.. అభినయాలతో సినీ ప్రియుల మదిని దోచుకుంది. గతేడాది ‘రాక్షసుడు’తో చక్కటి విజయాన్ని ఖాతాలో వేసుకున్న ఈ భామ.. ప్రస్తుతానికైతే సినిమాల నుంచి చిన్న గ్యాప్‌ తీసుకోని విహార యాత్రలో జాలీగా గడిపేస్తోంది. ఇదే సమయంలో ఎప్పటికప్పుడు సోషల్‌ వాల్‌పై తన ముచ్చటైన చిత్రాలను పంచుకుంటూ కుర్రకారుకు కనుల విందును అందిస్తోంది. అయితే తాజాగా ఈ భామ పెట్టిన ఓ పోస్ట్‌నెట్టింట చర్చనీయాంశంగా మారింది. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో రెండు చిత్రాలను పెట్టి వాటికి ఆసక్తికరమైన వ్యాఖ్యలను జోడించింది. ఒక పోస్ట్‌లో ఓ జంట ఆహ్లాదకరమైన బీచ్‌లో కూర్చోని ఉన్న చిత్రాన్ని షేర్‌ చేస్తూ.. ‘‘ఈ అందమైన ప్రపంచంలో నువ్వు నేను మాత్రమే ఉన్నాం. కపుల్‌ గోల్స్‌’’ అని కామెంట్‌ చేసింది. మరి ఆమె చేసిన ఈ వ్యాఖ్యల్లో ఆ ‘నవ్వు’ అన్న పదం తన ప్రియుడిని ఉద్దేశించి పెట్టిందా? లేక ఏదో కవితాత్మకంగా చేసిన ఎక్స్‌ప్రెషనా? అన్నది అర్థం కాలేదు. మరో పోస్ట్‌లో తాను బీచ్‌లో ఉన్న బ్లాక్‌ షేడ్‌ చిత్రాన్ని షేర్‌ చేస్తూ ‘‘బీచ్‌ బే’’ అని కామెంట్‌ చేసింది. ఈ పోస్ట్‌లను బట్టీ చూస్తుంటే ఆమె తన ప్రియుడితో రహస్యంగా ఎక్కడికైనా విహారయాత్రకు వెళ్లిందా? లేక ఆమె ఒక్కతే దేశాలు చుట్టేస్తుందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొందరైతే అనుపమ షేర్‌ చేసిన బీచ్‌ కపుల్‌ ఫొటోపై స్పందిస్తూ.. నువ్వు చెప్పిన ఆ ‘నువ్వు’ క్రికెటర్‌ బూమ్రానేనా? అని కొంటెగా ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నట్లు గతంలో వార్తలొచ్చాయి. మరి ఈ మలయాళి ముద్దుగుమ్మ నిజంగా ప్రేమలో పడిందా? లేదా? అన్నది ఆమె స్పందిస్తే కానీ క్లారిటీ రాదు.

View this post on Instagram

You and I in this beautiful world ♥️🏝 #couplegoals 💎

A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) onCopyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.