న్యూయార్కులో అర్జున్‌ - మలైకా

బాలీవుడ్‌ ప్రేమజంట అర్జున్‌ కపూర్‌ - మలైకా అరోరాలు న్యూయార్కులో సందడి చేస్తున్నారు. నటుడు అర్జున్‌ కపూర్‌ తన ముప్పై నాలుగో పుట్టినరోజును న్యూయార్కులో జరుపుకుంటున్నారు. ప్రస్తుతం వీరిద్దరు కలిసి అందమైన ప్రదేశాల్లో సందడి చేస్తున్నారని సమాచారం. ముంబై నుంచి సోమవారమే న్యూయార్కుకి బయలుదేరారు. వెళ్లే ముందు మలైకా ఫెండి ట్రాక్‌సూట్‌ ధరించగా అర్జున్‌ క్లీన్‌ సేవ్‌తో నల్లని టీషర్టు బ్లూ డెనిమ్‌ జీన్స్‌తో చాలా ఉత్సాహంగా ఉన్నారని ఎయిర్‌పోర్ట్‌ వర్గాల సమాచారం. మొత్తం మీద పెళ్లి విషయం మాత్రం ఎప్పుడనేది తెలియడం లేదు. కానీ పీకల్లోతు ప్రేమలో మాత్రం మునిగిపోయారని కచ్చితంగా చెప్పవచ్చు. ప్రస్తుతం అర్జున్‌ వయసు ముప్ఫై నాలుగు సంవత్సరాలు కాగా మలైకా వయసు నలభై అయిదు కావడం విశేషం. సల్మాన్‌ సోదరుడు అర్బాజ్‌ఖాన్‌తో మలైకా 2017లో విడాకులు తీసుకుంది. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నారు.






View this post on Instagram

#malaikaarora & #arjunkapoor snapped at airport last night #airportdiaries #viralbhayani @viralbhayani

A post shared by Viral Bhayani (@viralbhayani) on



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.