అర్నాబ్‌ సినిమా ఫస్ట్‌ లుక్ విడుదల చేసిన వర్మ!

ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ లాక్‌డౌన్ సమయంలోనూ భయపడకుండా తనదైన శైలిలో సినిమాలు నిర్మిస్తూ ముందుకెళ్తున్నారు. ప్రముఖ జర్నలిస్ట్ అర్నాబ్‌ గోస్వామిపై సినిమా తీస్తానని ఇప్పటికే ప్రకటించారు. తాజాగా 'అర్నాబ్ - ది న్యూస్ ప్రాస్టిట్యూట్' అని పేరును ఖారారు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్‌తో మోషన్‌ పోస్టర్‌ని ఆగస్టు 12 రాత్రి విడుదల చేశారు. ప్రకటించిన మోషన్‌ పోస్టర్‌ వీడియోలో అర్నాబ్‌ గోస్వామి పెద్దపెద్దగా అరుస్తున్న మాటలు వినిపించాయి. ఫస్టలుక్‌ పోస్టర్ని వర్మ ట్విట్‌ చేస్తూ.. అర్నాబ్‌ని ఒక వేశ్యతో పోలస్తూ..తేడా ఏమిటంటే ఒక సాధారణ వేశ్య ఇతరులను ఆనందపరచడానికి తన బట్టలు తీస్తుంది. అయితే, అర్నాబ్‌ తనను తాను అలరించడానికి ఇతరుల దుస్తులను తొగిస్తాడు..అర్నాబ్‌ న్యూస్ వేశ్య అంటూ పేర్కొన్నారు. బాలీవుడ్‌ చిత్రసీమపై అర్నాబ్‌ డిబేట్‌ చేస్తున్న సమయంలో డర్టీ బాలీవుడ్‌ని సంబోంధించారు. చిత్రసీమలో అండర్‌ వరల్డ్ మాఫియాకి సంబంధాలు ఉన్నాయని, రేపిస్టులు, గ్యాంగ్‌స్టర్‌, కామంతో కళ్లుమూసుకుపోయిన పిశాచాలు చిత్రసీమలో ఉన్నట్లు అర్నాబ్‌ ఆరోపించిన సంగతి తెలిసిందే. అర్నాబ్‌ గోస్వామిపై ఓ సినిమా చేస్తున్నట్లు కూడా ఇప్పటికే ప్రకటించారు. అర్నాబ్‌ తనపై ఎదురుదాడికి దిగినా లేదా కించపరచేటట్లు ప్రయత్నించినా కూడా ఈ విషయాలన్నీ తను తీయబోయో సినిమా ప్రచారానికి వాడుకుంటానని వర్మ చెప్పారు. మరో వైపు అర్నాబ్‌ గోస్వామిలాంటి జర్నలిస్ట్, ఆయన మాట్లాడే తీరు చెత్తకుప్పలాంటింది అంటూ ట్విట్టర్లో గతంలో పేర్కొన్న సంగతి తెలిసిందే. వర్మ ఎలాంటి చిత్రాలైనా సరే, ఎంతటి హోదా ఉన్నా వ్యక్తులపై చిత్రాలను తెరకెక్కించడానికి వెనుకాడనే పేరు చిత్రసీమలో ఉండేనే ఉంది.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.