‘వాడు వీడు’, ‘వరుడు’, ‘సైజ్‌జీరో’లాంటి చిత్రాల్లో నటించి అలరించిన కథానాయకుడు ఆర్య. ప్రస్తుతం పా రంజిత్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. బాక్సింగ్ క్రీడా నేపథ్యంగా తెరకెక్కుతున్న చిత్రానికి ‘సర్పట్ట పరంబరై’ అనే పేరు ఖరారు చేస్తూ ఫస్ట్ లుక్‌ని విడుదల చేసింది చిత్రబృందం. ఈ సందర్భంగా దర్శకుడు పా రంజిత్ మాట్లాడుతూ..‘‘ఇందులో ఆర్య కబిలన్ అనే పాత్రలో నటిస్తున్నారు. ఇతరుల నుంచి మంచి గుర్తింపు, గౌరవం పొందడానికి బాక్సింగ్‌ను తన జీవితంగా ఎంచుకుంటాడని’’ చెప్పారు. కె9 స్టూడియోస్ పతాకంపై నిర్మితమయ్యే చిత్రానికి షణ్ముగం దక్షన్రాజ్ నిర్మాత. సంతోష్ నారాయణ సంగీతం స్వరాలు అందిస్తుండగా, జి.మురళి సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. చిత్రంలో కలియరాసన్, జాన్ కొక్కెన్, దుషారా, సంతోష్ ప్రతాప్ తదితరులు నటిస్తున్నారు. ప్రస్తుతం విడుదలైన పోస్టర్లో ఆర్య బాక్సర్‌గా ఆటగాడి పాత్రలో వైవిధ్యంగా కనిపిస్తున్నారు.