జూనియర్‌ అసిన్‌ని చూశారా?

సంప్రదాయ దుస్తులు ధరించి చిరు నవ్వులు చిందిస్తున్న ఈ చిన్నారి ఎవరో కాదు ఒకప్పటి స్టార్ కథానాయిక అసిన్‌ మద్దుల తనయ. పేరు అరిన్. ఓనం సందర్భంగా తన గారాల కూతురి ఫొటో పోస్ట్‌ చేసి అభిమానులకు శుభాకాంక్షలు తెలిపింది అసిన్‌. ‘తల్లిదండ్రులుగా మేము జరుపుకుంటున్న తొలి ఓనం వేడుక’ని తన భర్తతో కలిసి దిగిన మరో ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పంచుకుంది. అయితే ఈ రెండు ఫొటోలు గతేడాదివంటూ చెప్పుకొచ్చింది. ఏది ఏమైనా ప్రస్తుతం ఈ ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. ‘వావ్, చాలా బావుంది క్యూట్‌ బేబీ’ అంటూ నెటిజన్లు కామెంట్స్‌ పెడుతున్నారు.View this post on Instagram

#throwback to last year- Arin’s 1st Onam, 10months old👶🏻 #ourlilprincess

A post shared by Asin Thottumkal (@simply.asin) onCopyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.