బుల్లితెర నుంచి వెండితెరకు పరియమైన నటి అవికా గోర్. తెలుగులో ‘ఉయ్యాలా జంపాలా’ చిత్రంతో కథానాయికగా తెరంగేట్రం చేసింది. తాజాగా ఈ అమ్మడు ఓ కొరియాగ్రాఫర్తో కలిసి డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. వీడియోలో అవికా చేస్తున్న డ్యాన్స్ హంగామా మామూలుగా లేదు. బొద్దుగా కనిపించే ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు చాలా నాజూగ్గా కనిపిస్తూ డ్యాన్స్ లో దుమ్ములేపుతోంది. తెలుగులో ఈ అమ్మడు బుల్లితెర వ్యాఖ్యాత ఓంకార్ సోదరుడు హీరోగా నటించిన ‘రాజుగారి గది-3’లోనూ అలరించింది. అంతకు ముందు రాజ్ తరుణ్‌తో కలిసి ‘సినిమా చూపిస్త మావ’ చిత్రంలోనూ ప్రేక్షకులను మెప్పించింది. ఈ మధ్య ఇన్‌స్టాగ్రామ్‌లో డ్యాన్స్ లు చేస్తున్న వీడియోలను సామాజిక మాధ్యమాల్లో తెగ షేర్ చేస్తుంది. ఎందుకో ఏమో మరి!