‘అయ్యప్పనమ్‌’ చిత్రం రీమేక్‌ హక్కులు పొందిన జాన్‌ అబ్రహం

ప్రముఖ మలయాళ చిత్ర నటుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ నటించిన బ్లాక్‌బస్టర్‌ చిత్రం ‘అయ్యప్పనమ్‌ కోషియం’. సచి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలై ఘనవిజయం సాధించింది. ప్రస్తుతం ఈ సినిమా హిందీ రీమేక్‌ హక్క్లుల్ని బాలీవుడ్‌ నటుడు జాన్‌ అబ్రహం దక్కించుకున్నారు. ఈ సందర్భంగా జాన్‌ అబ్రహాం ట్విట్టర్లో సినిమా గురించి మాట్లాడుతూ..‘‘అయ్యప్పనమ్‌ కోషియం’ చిత్రం యాక్షన్‌, థ్రిల్లర్‌గా బాగా ఆకుట్టకుంది. సినిమాలో ఎక్కడా బ్యాలన్స్ తప్పకుండా మంచి థ్రిల్లింగ్‌ గురిచేసే సినిమా. ఇలాంటి మంచి చిత్రం కథని మా జేఏ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సంతోషిస్తున్నాం..’’ అంటూ తెలిపాడు. ‘అయ్యప్పనమ్‌ కోషియం’ కేవలం ఆరు కోట్ల బడ్జెట్‌తో నిర్మించగా 60 కోట్లను రాబట్టింది. పృథ్వీరాజ్‌ ఇందులో మాజీ ఆర్మిఅధికారికగా నటించాడు. ఇక జాన్‌ అబ్రహం ఇప్పటికే ‘ముంబై సాగా’, ‘ఎటాక్‌’, ‘సత్యమేవ జయతే 2’ చిత్రాలు చేస్తున్నాడు. అంతేకాదు ప్రముఖ సామాజిక వ్యవస్థాపకుడు రేవతి రాయ్‌ జీవితాధారంగా సినిమా తీయనున్నట్లు ఇప్పటికే ప్రకటించాడు. మొత్తం లాక్‌డౌన్ ఎత్తివేయగానే సినిమాపై మరిన్ని వివరాలు బయటకు రానున్నాయి.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.