రష్యా బుల్లితెరపై ‘బాహుబలి 2’


భారతీయ సినీ పరిశ్రమ సత్తా చాటిన తెలుగు చిత్రం ‘బాహుబలి’. రష్యా దేశంలోని ఓ టెలివిజన్‌ ఛానెల్లో రష్యన్‌ వాయిస్‌ ఓవర్‌తో ‘బాహుబలి2’ చిత్రాన్ని ప్రసారం చేసింది. అదే విషయాన్ని రష్యన్‌ ఫెడరేషన్‌ రాయబార ఇండియా కార్యాలయం తన అధికారిక ట్విట్టర్లో పెట్టింది. అంతే కాదు..‘‘భారతీయ సినిమా రష్యాలో ప్రజాదరణ పొందింది. ప్రస్తుతం రష్యన్‌ టీవీ ప్రసారం చేస్తున్న వీడియోను చూడండి అంటూ..’’పేర్కొంది. దర్శకధీరుడు రాజమౌళి సృష్టించిన ‘బాహుబలి’ అనే కళాఖండం మనదేశ చిత్రసీమ గొప్పతనాన్ని చాటిచెబుతూనే ఉంది అనడానికి ఇదొక నిదర్శనం. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరలవుతోంది. ప్రభాస్‌, అనుష్క శెట్టి, రానా, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్‌, నాజర్‌ కీలక పాత్రల్లో నటించి మెప్పించారు. దర్శకుడు రాఘవేంద్రరావు సమర్పణలో ఆర్కా మీడియా పతాకంపై నిర్మితమైన ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందించారు. హిందీతో పాటు దక్షిణాది అన్నీ భాషలో సినిమా విడుదలై ప్రభంజనం సృష్టించింది.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.