బాబు ఆంటోని గుర్తున్నాడా!

బాలకృష్ణ చిత్రం ‘లారీడ్రైవర్‌’ చిత్రం చూస్తే మనకు గుర్తొచ్చే విలన్లు ఇద్దరు వారిలో ఒకరు మోహన్‌రాజ్‌ (గుడివాడ రౌడి) కాగా రెండోవాడు బాబు ఆంటోని (శ్రీను) ఈ చిత్రంలో శీను‌ (బాబు ఆంటోని) టైర్లలో డబ్బులుపెట్టి ఎవరికి కనిపించకుండా దొంగచాటుగా పంపిస్తుంటాడు. దక్షిణాది చిత్రాలతో పాటు హిందీ, శ్రీలంక చిత్రంలోనూ నటించాడు. హాలీవుడ్‌లోనూ రెండు చిత్రాల్లో నటించి మెప్పించాడు. ప్రస్తుతం బాబు ఆంటోని ‘పవరస్టార్’‌ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఒమర్‌ లల్లూ దర్శకత్వంలో తెరకెక్కే ఈ చిత్రంలో హాలీవుడ్‌కి చెందిన కథానాయకులు ఇద్దరు కీలక పాత్రల్లో నటించనున్నారు. ఇదే విషయాన్ని దర్శకుడు ఒమర్‌ లల్లూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటించాడు. ఒమర్‌ లల్లూ దర్శకత్వంలో వచ్చిన ‘ఓరు అదార్ లవ్’ తెలుగులో ‘లవర్స్ డే’గా విడుదలైంది. బాబు ఆంటోని నటుడే కాకుండా మార్షల్‌ ఆర్ట్సలోనూ మంచి ప్రావీణ్యం సంపాదించాడు. ఇతను తెలుగులో ‘పసివాడి ప్రాణం’, ‘జేబుదొంగ’, ‘నిప్పురవ్వ’, ‘శత్రువు’లాంటి చిత్రాల్లో విలన్‌గా నటించి మెప్పించాడు.

Also Read : ఈ చిత్రాలు ఓటీటీల్లో విడుదల అవ్వక తప్పదా!





Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.