బాలయ్య బర్త్‌డే గిఫ్ట్‌ వచ్చేసింది..
క అనుమానాలు తీరిపోయాయి. స్పష్టమైన ప్రకటన వచ్చేసింది. పుట్టినరోజు వేళ తన అభిమానులకు తీపి కబురు వినిపించారు నందమూరి బాలకృష్ణ. తాను నటించబోయే 105వ చిత్రానికి సంబంధించి అధికారిక ప్రకటన వినిపించేశారు. త్వరలో కెఎస్‌ రవికుమార్‌ దర్శకత్వంలోనే తన కొత్త చిత్రాన్ని మొదలుపెట్టబోతున్నారు బాలయ్య. దీనికి సి.కల్యాణ్‌ నిర్మాతగా వ్యవహరించబోతున్నారు. జూన్‌ 13న ఈ చిత్ర షూటింగ్‌ లాంఛనంగా మొదలు కాబోతున్నట్లు సమాచారం అందుతోంది. ఇందులో బాలయ్య ఓ పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా సరికొత్త లుక్‌తో దర్శనమివ్వబోతున్నారట. దీనికోసమే ఇప్పటికే గడ్డం పెంచే పనిలో ఉన్నారు ఆయన. ఇక ఈ చిత్రంలో బాలయ్యకు జోడీగా మెహ్రీన్, పాయల్‌ రాజ్‌పుత్‌లలో ఒకరు కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రతినాయకుడిగా జగపతిబాబును ఫైనల్‌ చేసిందట చిత్ర బృందం. ఇక ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు చిత్ర ప్రారంభోత్సవం నాడు ప్రకటించనున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.