దసరా వేళ రుద్ర నరసింహుడిలా..
బాలకృష్ణ కథానాయకుడుగా కె.ఎస్‌. రవికుమార్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఎన్‌బీకే 105గా రూపొందుతున్న ఈ సినిమాకు ‘రూలర్‌’ అనే టైటిల్‌ పరిశీలనలో ఉంది. ఇందులోని బాలకృష్ణ లుక్‌ను దసరా కానుకగా విడుదల చేసింది చిత్ర బృందం. ఈ పోస్టర్‌లో ఒంటినిండా పసుపు కుంకుమతో.. చేతిలో కత్తి పట్టుకుని ఉగ్ర రూపంలో దర్శనమిచ్చాడు బాలకృష్ణ. ప్రస్తుతం ఈ లుక్‌ అంతర్జాలంలో వైరల్‌ అవుతోంది. ప్రముఖ నిర్మాత సి.కల్యాణ్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో వేదిక, సోనాల్‌ చౌహాన్‌ కథానాయికలు. భూమిక కీలక పాత్రలో కనిపించనుంది.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.