విడుదల కానున్న ‘రూలర్‌’ ట్రైలర్‌


‘అ
ల్లరికృష్ణయ్య’ బాలకృష్ణ కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘రూలర్‌’. ఇప్పటికే సినిమాకి సంబంధించిన ఫస్ట్‌లుక్స్‌ పోస్టర్స్, టీజర్‌ విడుదలై ఆకట్టుకుంటున్నాయి. తాజాగా చిత్ర ట్రైలర్‌ను విడుదల చేసేందుకు విడుదల తేదీని చిత్రబృందం ఖరారు చేశారు. డిసెంబర్‌ 8, 2019, ఉదయం 8గంటల 19 నిమిషాలకు ట్రైలర్‌ని విడుదల చేస్తున్నట్లు నిర్మాణ సంస్థ తన అధికారిక ట్విట్టర్లో పేర్కొంది. బాలయ్య ఇందులో విభిన్నమైన రెండు పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన పలు పోస్టర్లో బాలకృష్ణ చాలా కొత్తగా కనిపిస్తూ అలరిస్తున్నారు. హ్యాపీ మూవీస్‌ పతాకంపై నిర్మిస్తున్న సినిమాకి సి.కల్యాణ్‌ నిర్మాతగా వ్యవరిస్తున్నారు. ఇంకా చిత్రంలో కథానాయికలుగా సోనాల్‌ చౌహాన్, వేదికలు నటిస్తుండగా, ప్రకాష్‌ రాజ్, జయసుధ, భూమిక చావ్లాలు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.