ప్రభాస్‌ అందరితో కలిసిపోతారు: భాగ్యశ్రీ


‘ప్రేమపావురాలు’ చిత్రంతో సినీ ప్రేమికుల మనసు గెలుచుకున్న నటి భాగ్యశ్రీ. ఆ సినిమా వచ్చి ఇన్ని సంవత్సరాలైన ఆమెకు ఉన్న క్రేజ్‌ ఏమాత్రం తగ్గలేదు. ప్రస్తుతం ప్రభాస్‌ నటిస్తోన్న ‘రాధేశ్యామ్’‌ చిత్రంలో భాగ్యశ్రీ ఓ పాత్ర పోషిస్తుంది. ఈ మధ్యనే సినిమాకి సంబంధించిన టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్‌ని కూడా చిత్రబృందం విడుదల చేసింది. తాజాగా ఈ సినిమా గురించి భాగ్యశ్రీ మాట్లాడుతూ..‘‘ముఫ్పైయేండ్ల కిత్రం వెండితెర అరంగేట్రం చేసిన నేను ఇప్పటికీ కొత్తగా నటిస్తున్నట్లే ఉంది. కరోనా వైరస్‌ పరిస్థితులు సాధారణ స్థితికి చేరగానే మళ్లీ సినిమా షూటింగ్‌ మొదలుకానుంది. నా సినిమాలోని నా పాత్ర గురించి పక్కన పెడితే ప్రభాస్‌ చాలా మంచి వ్యక్తి. ‘బాహుబలి’ లాంటి చిత్రం తరువాత కూడా అతను మామూలుగానే ఉన్నారు. ఆయన నిరాడంబరత నాకెంతో నచ్చింది. తోటి నటీనటులతో ఇట్టే కలిసిపోతారు. చాలా కూల్‌గా మాట్లాడుతారు. అతను తక్కువ ఎక్కువగా అంటూ ఎవరిని ప్రత్యేకించి చూడరు. అందరితో ఓ కుటంబంలోని వ్యక్తిలా కలిసిపోతారని చెప్పింది.

రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రాధేశ్యామ్’‌ చిత్రం లాక్‌డౌన్‌ ప్రకటించే నాటికి జార్జీయాలో షూటింగ్‌ జరుపుకొంటోంది. అందమైన ప్రేమకథగా రూపొందుతున్న ఈ సినిమాలో పూజాహెగ్డే కథానాయిక. వీరిద్దరూ తొలిసారిగా కలిసి నటిస్తున్న చిత్రం ఇదే. గోపీకృష్ణ మూవీస్, యువి క్రియేషన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రంలో నటీనటులుగా జగపతిబాబు, సత్యరాజ్‌, భాగ్యశ్రీ, జయరాం, మురళీ శర్మ ప్రియదర్శి తదితరులు నటిస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో చిత్రాన్ని వచ్చే ఏడాదిలో విడుదల చేయనున్నట్లు సమాచారం.
Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.