ఎవరీ ‘భూమిక’

దట్టమైన అడవి.. మొక్కలు పెనవేసుకున్న ఓ మహిళ.. ప్రకృతి ప్రేమికురాలా? దుస్తులకు బదులు పూల మొక్కల తీగలు ధరించెందుకు? తెలియాలంటే ‘భూమిక’ సినిమా చూడాల్సిందే. ఐశ్వర్య రాజేష్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న కొత్త చిత్రం ‘భూమిక’. రథింద్రన్‌ ఆర్‌.ప్రసాద్‌ దర్శకుడు. కార్తిక్‌ సుబ్బరాజు నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలోని ఐశ్వర్య రాజేష్‌ ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు నాయిక తమన్నా భాటియా. పోస్టర్‌ చూస్తుంటే అడవి నేపథ్యంలో సాగే కథగా అనిపిస్తుంది. అడవికి, ఐశ్వర్యకు సంబంధం చూపించి ఆసక్తికరంగా మలిచారు. ప్యాషన్‌ స్టూడియోస్‌, స్టోన్‌ బెంచ్‌ ఫిల్మ్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఐశ్వర్యకు ఇది 25వ చిత్రం.




Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.