బాలీవుడ్‌ నిర్మాత హరీష్ షా కన్నుమూత!


ప్రముఖ బాలీవుడ్‌ దర్శకనిర్మాత‍ హరీష్ షా కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన ఈ రోజు తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయన వయసు 76 సంవత్సరాలు. ఈయన ‘ధన్ దౌలత్’, ‘జల్జాలా’, ‘అబ్ ఇన్సాఫ్ హోగా’ చిత్రాలకు దర్శకత్వం వహించారు. అంతేకాదు ‘జాల్: ది ట్రాప్’, ‘రామ్ తేరే కిత్నే నామ్’, ‘కాలా సోనా’లాంటి ఎన్నో చిత్రాలను నిర్మించాడు. హరీష్ షా క్యాన్సర్‌పై ‘వై మి’ అనే షార్ట్ ఫిల్మ్‌ను నిర్మించారు, ఇది రాష్ట్రపతి అవార్డును గెలుచుకుంది. హరీష్‌ షా మృతిపై బాలీవుడ్‌కి చెందిన పలువురు సీనీ ప్రముఖులు స్పందిస్తూ..‘‘బాలీవుడ్‌లో ఓ గొప్పదర్శకనిర్మాతను కోల్పోయామంటూ సామాజిక మాధ్యమాల ద్వారా సంతాప సానుభూతిని’’ తెలియజేశారు. హరీష్‌ సోదరుడు నిర్మాత అయిన వినోద్ షా మాట్లాడుతూ..‘‘హరీష్ (అన్నయ్య) అంత్యక్రియలు ఈ రోజు పవన్ హన్స్ శ్మశానవాటికలో జరుగుతాయి. కరోనా కారణంగా అంత్యక్రియలకు చాలా కొద్ది మందికి మాత్రమే అనుమతి ఉంది. ఆయన చివరి కర్మలు చేయడానికి ఇద్దరు లేదా ముగ్గరికి మాత్రమే ఉంటారని..’’చెప్పారు. ముఖ్యంగా ధర్మేంద్ర 1988లో నటించిన ‘జల్జాలా’ చిత్రం, రిషి కపూర్ -నీతు కపూర్ కలిసి నటించిన ‘ధన్ దౌలత్’ చిత్రాలు బాగా ప్రసిద్ధి చెందాయి.





Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.