బన్నీ ట్రీట్‌ భలే ఉంది కదూ!

అల్లు అర్జున్‌ నటిస్తున్న ‘అల వైకుంఠపురములో’ చిత్రంలోని ఓ పాటకు సంబంధించిన టీజర్‌ను విడుదల చేస్తున్నట్లు చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఎవరూ ఊహించని సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు. ‘ఓ మైగాడ్‌ డాడీ’ అంటూ సాగే ఈ పాటలో బన్నీ కనిపిస్తాడనే ఎదురుచూసిన అభిమానులకు ట్రీట్‌ ఇచ్చాడు. అదేంటంటే? ఈ వీడియోలో అర్జున్‌ ఫొటోను చూస్తూ తన పిల్లలిద్దరూ పాట పాడుతుంటారు. వాళ్ల ముద్దు ముద్దు హావభావాలతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. బాలల దినోత్సవం సందర్భంగా చిన్నారులు, అభిమానులకు అదిరిపోయే ట్రీట్‌ ఇచ్చాడు బన్నీ. తివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకుగా విడుదల కానుంది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. సంగీతం: తమన్‌.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.