గోపీచంద్‌ బర్త్‌ డే గిఫ్ట్‌ వచ్చేసింది
ప్రతినాయకుడిగా తెరపై మెరిసి.. కథానాయకుడిగా మారిన కొద్దిమంది సినీతారల్లో గోపీచంద్‌ ఒకరు. ‘యజ్ఞం’, ‘రణం’, ‘లక్ష్యం’, ‘సాక్ష్యం’, ‘జిల్‌’ వంటి హిట్‌ చిత్రాలతో యాక్షన్‌ హీరోగా తెలుగు చిత్రసీమలో మంచి గుర్తింపు సాధించుకున్నారు. ప్రస్తుతం ఈ యువ హీరో ‘చాణక్య’ అనే సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించేందుకు సిద్ధమయ్యాడు. తిరు దర్శకత్వం వహిస్తున్నారు. మెహరీన్‌ కథానాయికగా నటిస్తోంది. తాజాగా తన పుట్టినరోజును పురస్కరించుకోని గోపీచంద్‌ ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను ట్విటర్‌ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఈ పోస్టర్‌లో.. గుబురు గడ్డంతో, మెడలో స్కార్ఫ్‌ వేసుకోని జనాల మధ్య నుంచి సీరియస్‌ లుక్‌తో నడుస్తూ వస్తూ కనిపించారు ఆయన. ఇందులో ఆయన చుట్టూ ఉన్న ముస్లిం జనాలు, దూరంగా కనిపిస్తున్న మసీద్, రోడ్డు పక్కన బండల్లపై రాసి ఉన్న ఉర్దూ పేర్లను బట్టీ చూస్తుంటే గోపీచంద్‌ పాక్‌లోని ఏదో ప్రాంతంలో ఉన్నట్లు అర్థమవుతోంది. ఓ సరొకత్త స్పై థ్రిల్లర్‌ కథాంశంతో చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇండియా - పాక్‌ బోర్డర్‌ నేపథ్యంలో వచ్చే యాక్షన్‌ సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని చిత్ర బృందం తెలియజేసింది. దీనికి విశాల్‌ శేఖర్‌ స్వరాలు సమకూరుస్తుండగా.. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై అనిల్‌ సుంకర నిర్మిస్తున్నారు.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.