అవయవదానం కథాంశంగా నితిన్‌ సినిమా

నితిన్‌ కథానాయకుడిగా చంద్రశేఖర్‌ ఏలేటి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. ఇప్పుడీ సినిమా కథ ఏమిటనే విషయం తెలిసింది. అవయవదానం ఆవశ్యకతను ఈ సినిమా ద్వారా వివరించబోతున్నారట. మనిషి చనిపోయిన తరువాత వారి అవయవాలను మరొకరికి దానం చేయాలనే సామాజిక చైతన్యాన్ని ప్రజల్లో కలిగించేందుకు కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ని జోడించి చిత్రీకరిస్తారట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. భవ్య క్రియేషన్స్‌ పతాకంపై ఆనంద్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ పేరు కథానాయికగా పరిశీలనలో ఉంది. వివరాలను చిత్రబృందం అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.
సంబంధిత వ్యాసాలు


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.