ఛార్మి.. స్వీటీ.. ‘ఇస్మార్ట్‌ నిశ్శబ్దం’

బూరె బుగ్గల సుందరి ఛార్మి తాజాగా నెట్టింట ‘ఇస్మార్ట్‌ నిశ్శబ్దాన్ని’ చూపించింది. అయితే ఇదేదో ‘ఇస్మార్ట్‌ శంకర్‌’కి సీక్వెల్‌ చిత్రమనుకోకండి. తాజాగా స్వీటీతో కలిసి ఛార్మి తీసుకున్న ముచ్చటైన చిత్రానికి ఆమె ఇచ్చుకున్న క్యాప్షన్‌ ఇది. ఇంతకీ విషయం ఏంటంటే.. తాజాగా స్వీటీ అనుష్కతో కలిసి ఈ ఛార్మింగ్‌ గర్ల్‌ ముంబయిలోని ఓ హోటల్‌కి లంచ్‌కు వెళ్లిందట. ఈ సందర్భంగానే ఆమె స్వీటీతో కలిసి కెమెరాకు ఓ ఫోజిచ్చింది. ఇందులో ఆమె భాగమతిని గట్టిగా హత్తుకొని చిరునవ్వులు చిందిస్తూ దర్శనమిచ్చింది. ఇక ఈ చిత్రంలో స్వీటీ స్మైల్‌ అయితే చలి కాలంలోనూ కుర్రకారు ఒంట్లో సెగలు పుట్టించేంత క్యూట్‌గా ఉంది. దీనికి ఛార్మింగ్‌ గర్ల్‌ ‘‘చ్వీటీ స్వీటీ అనుష్క శెట్టితో ముంబయిలో లంచింగ్‌ మంచింగ్‌. ‘ఇస్మార్ట్‌ నిశ్శబ్దం’ అని ఆసక్తికరమైన క్యాప్షన్‌ ఇచ్చింది. ప్రస్తుతం అనుష్క ‘నిశ్శబ్దం’ చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించేందుకు సిద్ధమవుతుండగా.. ఛార్మి తన నిర్మాణ సారథ్యంలో ‘రొమాంటిక్‌’ చిత్రాన్ని ముస్తాబు చేసే పనిలో బిజీగా ఉంది. పూరి జగన్నాథ్‌ తనయుడు ఆకాష్‌ పూరి హీరోగా నటిస్తున్న చిత్రమిది. ఇందులో ఎనర్జిటిక్‌ హీరో రామ్‌ అతిథి పాత్రలో తళుక్కున మెరవబోతున్నారు.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.