షూటింగ్‌లో కాల్చా.. బ్రేక్‌లో కాదు!

జన సంచారంలో సిగరెట్‌ కాలుస్తున్నాడనే కారణంతో ఛార్మినార్‌ పోలీసులు హీరో రామ్‌కు రూ.200 జరిమానా విధించిన సంగతి విదితమే. ఈ ఘటనపై సామాజిక మాధ్యమాల్లో విభిన్న రకాల కామెంట్స్‌ వస్తున్నాయి. దీంతో ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ చిత్రంలో పోషిస్తున్న పాత్రకు తగ్గట్టుగానే సమాధానం ఇచ్చాడు. ‘‘నా టైము- పబ్లిక్‌ టైము వేస్ట్‌ చేయడం ఇష్టం లేక రెస్పాండ్‌ గాలే.. షాట్‌ల కాల్చిన తమ్మీ.. బ్రేక్‌ల కాదు.. గిప్పుడు నువ్వు కూడా నా లెక్క లైట్‌ తీస్కో పనిచూస్కో’’ అంటూ ఆసక్తికర వాఖ్యలు చేశారు. పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ చిత్రీకరణ శరవేగంగా జరుపుకుని జులైలో విడుదలకు సిద్ధమవుతోంది. నిధి అగర్వాల్, నభా నటేశ్‌ కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమాను పూరి, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.