సెప్టెంబర్‌ 21న ‘చావు కబురు చల్లగా..!’ ప్రత్యేక వీడియో

‘‘చావు కబురు చల్లగా..!’ వినిపించేందుకు సిద్ధమయ్యాను..’’ అంటున్నాడు హీరో కార్తికేయ. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ సమర్పణలో బన్నీవాసు నిర్మిస్తున్నచిత్రానికి కౌశిక్‌ పెగళ్లపాటి దర్శకత్వం వహిస్తున్నారు. లావణ్య త్రిపాఠి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం ప్రత్యేక వీడియోని కథానాయకుడు కార్తికేయ పుట్టినరోజు సెప్టెంబర్‌ 21న ఉదయం 11:47 నిమిషాలకు విడుదల చేయనున్నారు. చిత్రంలో బస్తీ బాలరాజు పాత్రలో కార్తికేయ నటిస్తున్నారు. సినిమాకి సంబంధించిన ఫస్ట్‌లుక్ విడుదలై ఆకట్టుకుంది. ఇప్పటికే చిత్రానికి సంబంధించిన కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుపుకొంది. త్వరలోనే షూటింగ్‌ షెడ్యూల్ ప్రారంభించి చిత్రీకరణ శరవేగంగా పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిధ్ధం చే‍స్తున్నట్లు నిర్మాత బన్నీ వాసు తెలిపారు. ఆ మధ్య సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ విడుదలైంది. పోస్టర్లో కార్తికేయ ట్రాఫిక్‌ జామ్‌లో చిక్కుకున్న ఓ వాహనంపై నిల్చుని దర్జగా సిగరెట్‌ తాగుతూ దర్శనమిచ్చారు. గళ్ల చొక్కా, లుంగీ ధరించి అచ్చం బస్తీ కుర్రాడి లుక్‌లో ఒదిగిపోయారు. ట్రాఫిక్‌ జామ్‌లో కూడా చాఆలా ప్రశాంతంగా బస్తీ బాలరాజు అందరి దృష్టిని ఆకర్షించాడు.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.