చెర్రీని ఆటపట్టిస్తున్న ఈ బాలుడు ఎవరో?

టీవలే ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా తెరిచిన యువ కథానాయకుడు రామ్‌ చరణ్‌ సినిమా, వ్యక్తిగత విషయాలు ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంటాడు. తాజాగా ఓ చిన్నారితో కలిసి జిమ్‌లో తీసుకున్న వీడియోను షేర్‌ చేశాడు. ఇందులో చెర్రీ ఈ బుడతడ్ని ప్రశ్నలు అడిగి, ఆటపట్టిస్తూ కనిపించాడు. ఆ చిన్నారి ముద్దు ముద్దు మాటలతో రామ్‌కు సమాధానం చెప్పే విధానం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రస్తుతం ఈ ఫన్నీ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. షేర్‌ చేసిన కొద్ది సమయంలోనే లక్షల మంది వీక్షించారు. చెర్రీ ఈ వీడియోను షేర్‌ చేస్తూ.. ‘జిమ్‌ బడీస్‌’ అని ఓ వ్యాఖ్యను జోడించాడు తప్ప మరే ఇతర వివరాలు పోస్ట్‌ చేయలేదు. దీంతో అసలు ఈ బాలుడు ఎవరో తెలియక సందేహంలో పడ్డారు నెటిజన్లు.

View this post on Instagram

Gym buddies !

A post shared by Ram Charan (@alwaysramcharan) onCopyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.