నెట్టింట వైరల్‌గా ‘చియాన్‌ 58’ ఫొటోలు

‘శివపుత్రుడు’, ‘అపరిచితుడు’లోని నటనతో తనకంటూ ఓ ప్రత్యేక ముద్ర వేసుకున్న నటుడు విక్రమ్. ఇప్పుడు వాటికి మించిన ప్రయత్నమే చేయబోతున్నాడు. తన 58 చిత్రంలో 25 వేషాలతో దర్శనమివ్వనున్నసంగతి తెలిసిందే . ఇందులో ‘కె.జి.ఎఫ్’ భామ శ్రీనిధి హీరోయిన్ గా నటిస్తుంది. ప్రముఖ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ఈ చిత్రంతో వెండితెరకు పరిచయం అవుతున్నాడు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. నటీనటులు షూటింగ్‌లో పాల్గొన్న చిత్రాలివి. ఈ చిత్రానికి అజయ్ నమ్ముత్తు దర్శకునిగా వ్యవహరిస్తున్నాడు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.