‘అర్బన్‌ మాంక్‌’ మేకింగ్‌ ఇదుగో!

ప్రముఖ కథానాయకుడు చిరంజీవి కొత్త లుక్‌తో అందరిని ఆశ్చర్యపరిచారు. గుండుతో దర్శనమిచ్చి ఔరా అనిపించారు. ఆయన నటించబోయే ఓ సినిమాకు సంబంధించిన ట్రయిల్‌ లుక్‌ ఇది. దీనినే ‘అర్బన్‌ మాంక్‌’ స్టైల్‌ అంటారు. విడుదలైన క్షణాల్లోనే సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. ఇదేంటి చిరు ఇలా అయ్యారు? ఇదేలా సాధ్యమైంది? అనే ప్రశ్నలు చూసిన వారందరిలో మొదలయ్యాయి. ఈ స్టైల్‌ వెనకున్న రహస్యాన్ని ప్రేక్షకులకు ఓ వీడియోలో చూపించారు చిరు. నిపుణులు ఈ గెటప్‌ని ఎలా ఆవిష్కరించారో ఈ వీడియోలో తెలియజేశారు. ‘‘నిజమైన లుక్‌ అనిపించేలా తీర్చిదిద్దిన టెక్నిషియన్స్‌ అందరికి కృతజ్ఞతలు. సాల్యూట్‌ టు మ్యాజిక్‌ ఆఫ్‌ సినిమా’’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం కొరటాల దర్శకత్వంలో ‘ఆచార్య’లో నటిస్తున్నారు చిరు. తర్వాత ‘లూసిఫర్‌’, ‘వేదాళం’ రీమేక్‌లు చేయబోతున్నారు. మరి ఇందులో ఏ సినిమా కోసం అర్బన్‌ మాంక్‌ ప్రయత్నించారో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.


View this post on Instagram

Thanks to all the technicians of the industry, who can make any look believable. Salute the magic of cinema!

A post shared by Chiranjeevi Konidela (@chiranjeevikonidela) onCopyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.