భయ పడకండి.. నిర్లక్ష్యంగా ఉండకండి

కరోనా యావత్‌ ప్రపంచాన్ని భయాందోళనకు గురి చేస్తోంది. ఈ మహమ్మారిని అరికట్టే చర్యలపై అటు ప్రభుత్వాలు, ఇటు ప్రముఖులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. తాజాగా టాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు చిరంజీవి ఓ వీడియో రూపొందించి కరోనా జాగ్రత్తలు వివరించారు. ‘‘మనకు ఏదో అయిపోతుందనే భయం వద్దు, మనకు ఏమీ కాదనే నిర్లక్ష్యం వద్దు. జాగ్రత్తగా ఉండి ధైర్యంగా ఎదుర్కోవాల్సిన సమయం ఇది. జన సమూహానికి వీలైన దూరంగా ఉండండి. ఈ తీవ్రత తగ్గే వరకు ఇంటికే పరిమితం అవడం ఉత్తమం’’ అని సూచించారు. కరోనా కారణంగా కొరటాల దర్శకత్వంలో నటిస్తున్న చిత్రానికి చిరు విరామం ప్రకటించిన సంగతి తెలిసిందే.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.