మ‌న‌మే నాశ‌నం చేసుకుంటున్నాం

ఇప్పుడు ప్రపంచమంతా కరోనా గుప్పిట బందీగా ఉంది. ఈ మహమ్మారి వైరస్‌కు అడ్డుకç్ట వేసేందుకు అన్ని దేశాలు స్వీయ నిర్బంధాన్ని విధించుకోవడంతో.. ఎక్కడ చూసినా నిర్మానుష్య వాతారణమే దర్శనమిస్తోంది. కానీ, ఇప్పుడీ పరిస్థితుల వల్ల ప్రపంచ మానవాళి ఓ గొప్ప మార్పుకు శ్రీకారం చుట్టే అవకాశం కూడా దక్కిందంటున్నారు కథానాయకుడు చిరంజీవి. ఇక నుంచైనా ప్రకృతిని కాపాడుకోవాల్సిన అవశ్యకతను ప్రతి ఒక్కరూ గుర్తించాలని పిలుపునిస్తున్నారు. ఈ మేరకు గురువారం తన ఇంటిపై నుంచి భాగ్యనగరంలోని స్వచ్ఛమైన వాతావరణాన్ని చూపిస్తూ.. ఓ ప్రత్యేక వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పంచుకున్నారు. గతకొన్ని రోజులుగా కాలుష్యం పూర్తిగా తగ్గిపోవడంతో నగరంలో వాతావరణం ఎంతో నిర్మలంగా కనిపిస్తోందని, ప్రస్తుతం తన ఇంటిపై నుంచి ప్రశాంతమైన సూర్యోదయాల్ని ఆస్వాదిస్తున్నట్లు తెలియజేశారు. దీనిపై వీడియోలో చిరు మాట్లాడుతూ.. ‘‘ఈరోజు ఉదయం లేవగానే అందమైన సూర్యోదయాన్ని చూశా. చాలా ప్రశాంతంగా ఉంది. కాలుష్యం లేకపోవడం వల్ల సిటీ కూడా చివరి వరకు ఎంత చక్కగా కనిపిస్తోందో. రోజూ ఇలా ఉండొచ్చు కదా. పక్షుల కిలకిలా రావాలతో వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. దీన్ని బట్టీ చూస్తుంటే.. ఈ కాలుష్య వాతావరణం వల్ల మన దైనందిన జీవితాన్ని ఎంత కోల్పోతున్నామో అనిపిస్తోంది. ఒకరకంగా మన చర్యలతో మన భూమిని మనమే పాడుచేసుకుంటున్నాం అనిపిస్తోంది. ఇప్పటికైనా మనం వాస్తవాన్ని గుర్తిద్దాం. ప్రకృతి విలువ తెలుసుకుందాం. దీన్ని భద్రంగా కాపాడుకుందాం. దైవంలా పూజిద్దాం’’ అని ప్రజలకు పిలుపునిచ్చారు ఆయన.

View this post on Instagram

A post shared by Chiranjeevi Konidela (@chiranjeevikonidela) onCopyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.