ఉగాదికి చిరు కానుక
ఉగాది కానుకగా అగ్ర కథానాయకుడు చిరంజీవి ఓ శుభవార్త వినిపించారు. ఇకపై తాను ట్విటర్‌ వేదికగా అభిమానులకు, ప్రజలకు మరింత దగ్గర కాబోతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం కొణిదెల ప్రొడక్షన్స్‌ ట్విటర్‌ ఖాతా ద్వారా ఓ వీడియో ప్రకటన విడుదల చేశారు. ఇందులో ఆయన మాట్లాడుతూ.. ‘‘ఇక నుంచి నేను కూడా సామాజిక మాధ్యమాల్లోకి రావాలనుకుంటున్నా. ఎందుకంటే ఎప్పటికప్పుడు నా భావాలను, మనసులోని సందేశాలను ప్రజలకు, అభిమానులకు చెప్పుకోవడానికి ఇదే సరైన వేదిక అని భావించి ట్విటర్‌లోకి అడుగుపెడుతున్నా. అదీ ఉగాది రోజు నుంచే’’ అంటూ శుభవార్త చెవిన వేశారు చిరు. ప్రస్తుతం ఆయన కథానాయకుడిగా ‘ఆచార్య’ చిత్రం తెరకెక్కుతోంది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఇందులో చిరుకు జోడీగా కాజల్‌ అగర్వాల్‌ను ఎంపిక చేసుకున్నారు. రామ్‌చరణ్‌ కీలక పాత్రలో మెరవనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.