ట్విట్టర్‌లోకి అడుగుపెట్టిన మెగస్టార్‌

తెలుగు చిత్రసీమలో తనకంటూ ప్రత్యేకతను సంపాదించుకున్న కథానాయకుడు చిరంజీవి. తాజాగా ఆయన ఉగాది పండుగను పురస్కరించుకొని ట్విట్టర్‌ వేదికగా తన సందేశాన్ని తెలిపారు. ట్విట్టర్లో చిరు ఏం చెప్పాడంటే..‘‘అందరికీ శార్వరి నామ ఉగాది శుభాకాంక్షలు. నాతోటి భారతీయులందరితో, తెలుగు ప్రజలతో, నాకు అత్యంత ప్రియమైన అభిమానులందరితో నేరుగా ఈ వేదికను నుంచి మాట్లడ్డం నాకెంతో ఆనందంగా ఉంది అన్నాడు. మరోక ట్విట్‌లో భారతప్రధాని మోడి చెప్పినట్లు ‘‘అందరూ 21రోజులు మనందిరినీ ఇళ్లలోనే మనల్ని మనం స్వియనిర్భదంలో ఉండి కరోనా భారి నుంచి రక్షించుకుందాం’’ అంటూ పేర్కొన్నాడు. చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో కాజల్‌ కథానాయికగా నటిస్తోంది. చిరు ఇందులో దేవదాయశాఖలో పనిచేసే ఉద్యోగిగా కనిపించనున్నారట. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చిరంజీవి ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో ఒకటైన ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్నారు. ఇక చిరు అభిమానులు తమ కథానాయకుడితో నేరుగా అభిప్రాయాలు పంచుకోవచ్చు.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.