అదరగొట్టే అధర చుంబనం

సినిమాల్లో అదర చుంబన దృశ్యాలు ఇప్పుడు తప్పదన్నట్లు మారాయి. ఇప్పుడు తెలుగు సినిమాల్లో చుంబన దృశ్యాలు అంతర్జాతీయ సినిమాలను తలదన్నేస్థాయికి చేరాయి. గతంలో బాలీవుడ్‌లో చుంబన దృశ్యాలకు గుర్తింపుగా మారిన నటుడు ఇమ్రాన్‌ హష్మి. ఇప్పుడు ఆ స్థానాన్ని తెలుగులో విజయ్‌ దేవర కొండ స్థానాన్ని సంపాదించుకొన్నాడు. విజయ్‌ నటించిన ‘అర్జున్‌ రెడ్డి’ సినిమాలోని అధర చుంబన దృశ్యాలను ప్రేక్షకులు ఇంకా మర్చిపోక ముందే మరో చుంబన దృశ్యంతో ప్రేక్షకులను రెచ్చగొట్టేందుకు ‘డియర్‌ కామ్రేడ్‌’ చిత్రంతో వస్తున్నారు. ఈ సినిమాలో నాయిక రష్మిక అధరాలను ఓ రేంజ్‌లో జుర్రేసిన దృశ్యాలను టీజర్‌లో చూపించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ ఓ సినిమాలోనటిస్తున్నారు. ఇందులో రాశీఖన్నా నాయిక. ఈ సినిమాకు సంబంధించి ఓ విశేషం తెలిసింది ఇందులో విజయ్,రాశీఖన్నాల మధ్య ఓ సుదీర్ఘ అధర చుంబన దృశ్యం ఉంటుందట.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.