చంపేద్దాం కరోనాని!

మహమ్మారి కరోనా నేపథ్యంలో తెలుగు సినిమా కార్మికులను ఆదుకునేందుకు ‘కరోనా క్రైసిస్‌ ఛారిటీ (సీసీసీ)’ పేరిట విరాళాలు సేకరిస్తున్న విషయం తెలిసిందే. దీనిపై మరింత అవగాహన కల్పించేలా సంగీత దర్శకుడు కోటి ఓ పాటను స్వరపరిచారు. అగ్ర కథానాయకులు చిరంజీవి, నాగార్జునలతోపాటు యువ కథానాయకులు వరుణ్‌తేజ్, సాయితేజ్‌తో ఓ వీడియో రూపొందించి విడుదల చేశారు. ‘ఏదైనా ఏమైనా కరోనాపై యుద్ధం చేద్దాం.. చిన్నది మనలో ధైర్యం కన్నా.. ఏముంది విలువైంది మన ప్రాణం కన్నా.. లెట్స్‌ కిల్‌ దిస్‌ వైరస్‌’ అంటూ సాగే ఈ పాట ఆలోచింపజేస్తోంది. కరోనాపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియచేస్తూ.. ఈ నలుగురూ పాడిన పాట పలువురిని ఆకట్టుకుంటూ అవగాహన కల్పిస్తోంది.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.