‘క్రాక్‌’ లుక్‌తో కిరాక్‌ పుట్టిస్తున్న రవితేజ
నిన్న ‘డిస్కోరాజా’ టీజర్‌తో సందడి చేసిన రవితేజ నేడు ‘క్రాక్‌’ చిత్ర లుక్‌తో అభిమానుల్ని సర్‌ప్రైజ్‌ చేశాడు. గోపీచంద్‌ మలినేని తెరకెక్కిస్తున్న చిత్రమే ‘క్రాక్‌’. శ్రుతిహాసన్‌ కథానాయిక. ఇందులో రవితేజ పోలీసు అధికారిగా నటిస్తున్నాడు. సంక్రాంతి కానుకగా విడుదల చేసిన ఈ పోస్టర్‌లో బుల్లెట్‌ వాహనాన్ని నడుపుతూ కనిపిస్తుంది శ్రుతి. ఆమె వెనక రవితేజ స్టీల్‌ డబ్బా పట్టుకుని, కళ్లద్దాలు పెట్టుకుని, తలకు ఓ క్లాత్‌ కట్టుకుని కిరాక్‌ పుట్టిస్తున్నాడు. బాల నటుడు శ్రుతి ముందు కూర్చుని ఉంటాడు. శ్రుతి చీరలో దర్శనమిచ్చింది. పండగంతా ఈ ఫోటోలోనే ఉందా అనిపించేలా ఉంది. ఈ ముగ్గుర్ని ఓ ఫ్రేమ్‌లో చూస్తుంటే కుటుంబ విలువలు తెలియజేసే కథాంశంగా వస్తున్నట్లు అనిపిస్తుంది. మరోవైపు వి.ఐ.ఆనంద్‌ తెరకెక్కిస్తున్న ‘డిస్కోరాజా’ జనవరి 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.