మాలో ఎవరి దుస్తులు నచ్చాయో చెప్పండి...


గత కొంతకాలంగా క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌ సామాజిక మాధ్యమాల్లో తెలుగు సినీ ప్రముఖులను అనుసరిస్తూ హల్‌చల్‌ చేస్తున్నాడు. ‘బుట్టబొమ్మా బుట్టబొమ్మా’ పాట మొదలుకొని ఎన్టీఆర్‌, మహేష్‌బాబుల డైలాగ్స్ ని తనదైన శైలిలో పలుకుతూ అలరిస్తున్నాడు డేవిడ్‌.  ప్రభాస్‌ నటించిన ‘బాహుబలి’ చిత్రంలోని ఓ ఫోటోను, తన ఫోటోను జతచేసి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టుచేశాడు. అంతేకాదు ఆ ఫొటోకి.. ‘‘మీరు మాలో ఎవర్ని ఇష్టపడుతున్నారు. మాలో ఎవరి దుస్తులు ఇష్టపడుతున్నారో చెప్పంది..’’అంటూ ట్యాగ్‌లైన్‌ కూడా జోడించాడు. ఫోటో చూసిన కొంతమంది నెటిజన్లు..‘నీవు అచ్చం దేవేంద్ర బాహుబలిలా ఉన్నావని ఒకరంటే’, మరికొందరు ‘ఆస్ట్రేలియన్‌ బాహుబలి డేవిడ్‌బాయ్‌’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. మొత్తం మీద కొన్నాళ్లుగా ఆస్ర్టేలియన్‌ క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌ తెలుగు చిత్రసీమ నటులను అనుసరిస్తూ హంగామా చేస్తున్నాడు.

View this post on Instagram

A post shared by David Warner (@davidwarner31) on



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.