రాజుకి రాణి దొరికింది
‘బాహుబలి’ నటుడు ప్రభాస్ కథానాయకుడిగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వైజయంతి మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. అందరి అంచనాలు అందుకునేలా... వీలైతే దాటేసేలా ఆ సినిమా ఉండబోతోందని చిత్రబృందం చెబుతూ వస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన వివరాలను చిత్రబృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కథానాయికగా బాలీవుడ్‌ నటి దీపికా పదుకొణె ప్రభాస్‌కు జోడిగా నటిస్తోంది. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన నిర్మాణ పనులు ఇప్పటికే పూర్తయినట్లు సమాచారం. ప్రభాస్‌ ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో 'రాధే శ్యామ్‌'లో నటిస్తున్నారు. ఇందులో పూజాహెగ్డే కథానాయిక. ఈ చిత్రం పూర్తయిన వెంటనే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న పాన్ ఇండియా సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి.అశ్వనీదత్‌ నిర్మిస్తున్నారు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.