మృగాలను వేటాడిన మగాళ్లు మీరు

నిర్భయ, అభయ, ఉన్నావ్‌.. పేర్లు వేరైనా జరిగిన ఘోరాలు ఒక్కటే. శతాబ్దాల ఈ నాగరిక సమాజంలో జరిగిన అనాగరిక సంఘటనలకు ఉదాహరణలు వీరిపై జరిగిన ఈ హత్యాచారాలు. ఇలాంటి సమాజంలోనా మనం బతుకుతుంది అని సభ్య సమాజం తల దించుకున్న రోజులవి. మానవ మృగాల పైశాచికత్వానికి, పరాకాష్ఠకు నిదర్శనంగా మిగిలిన జీవితాలు అవి. తాజాగా హైదరాబాద్‌ శివార్లలో జరిగిన దిశ హత్యాచార ఘటన దేశం మొత్తాన్ని ఉలిక్కి పడేలా చేసింది. ఈ అఘాయిత్యానికి ఒడిగట్టిన నలుగురు నిందితులను తక్షణమే శిక్షించాలంటూ దేశ వ్యాప్తంగా ప్రజలు ఆందోళనలు చేపట్టిన సంగతీ తెలిసిందే. అయితే ఈరోజు ఉదయం అనూహ్యంగా ఈ కేసులోని ప్రధాన నిందితులు నలుగుర్ని పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేశారు. దిశపై అత్యాచారం జరిగిన ప్రదేశంలో ఉన్న ఆమె వస్తువులను చూపిస్తామంటూ నిందితులు పోలీసులకు చెప్పడంతో వారు ఆ నలుగురిని ఆ ప్రదేశానికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో వాళ్లు పోలీసులపై దాడి చేసి అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయగా ఎన్‌కౌంటర్‌ జరిపారు. ఇప్పుడీ కాల్పుల ఘటనపై అన్ని వర్గాల ప్రజలు రాజకీయ, సినీ వర్గాల వారు సామాజిక మాధ్యమాల వేదికగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. సినీ తారలు ఈ ఘటనపై ట్విటర్‌ వేదికగా స్పందిస్తూ.. ‘‘మృగాళ్లని వేటాడిన మగాళ్లు మీరు’’ అంటూ పోలీసులపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర సీమకు చెందిన పలువురు సినీ ప్రముఖులు సామాజిక మాధ్యమాల ద్వారా ఇలా స్పందించారు..Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.