ముస్తాబవుతున్న ‘డిస్కోరాజా’

వినోదాత్మక కథలకు చిరునామాగా నిలిచారు రవితేజ. అలాంటి కథలన్నీ రవితేజ కోసం వరుస కడుతున్నాయి. ప్రస్తుతం ‘డిస్కోరాజా’గా ముస్తాబు అవుతున్నారు రవితేజ. వి.ఐ.ఆనంద్‌ దర్శకత్వం వహిస్తున్నారు. మరోవైపు కొత్త కథలకు పచ్చజెండా ఊపు తున్నారు. గోపీచంద్‌ మలినేనితో రవితేజ మరో సినిమా చేయబోతున్నారని ప్రచారం జరుగుతోంది. గతంలో వీరిద్దరి కలయికలో ‘డాన్‌ శీను’, ‘బలుపు’ చిత్రాలొచ్చాయి. ఇప్పుడు హ్యాట్రిక్‌కు సిద్ధమవుతున్నారన్నమాట. ఈ చిత్రానికి ఠాగూర్‌ మధు నిర్మాతగా వ్యవహరిస్తాని సమాచారం. వి.వి.వినాయక్‌ కూడా రవితేజ కోసం ఓ కథ సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. ‘కృష్ణ’ తరవాత ఈ కలయికలో రాబోతున్న చిత్రమిదే. ‘ఆర్‌ఎక్స్‌ 100’తో ఆకట్టుకున్న అజయ్‌ భూపతితోనూ రవితేజ ఓ సినిమా చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.