నితిన్, కీర్తి సురేష్ జంటగా వస్తోన్న చిత్రం ‘రంగ్ దే’. ఈ ప్రేమ కథకి వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలోని తొలి గీతానికి సంబంధించి ప్రోమోని విడుదల చేసింది చిత్ర బృందం. అన్ని వర్గాల వారిని అలరించేలా ఉందీ గీతం. ‘ఏమిటో ఇది’ అంటూ సాగే ఈ గీతాన్ని శ్రీమణి రచించారు. కపిల్ కపిలన్, హరిప్రియ ఆలపించారు. దేవీ శ్రీ ప్రసాద్ స్వర కల్పనలో రూపొందిన ఈ పాట లిరికల్ వీడియో నవంబరు 7న సాయంత్రం 4:05నిలకు విడుదల చేస్తున్నట్లు చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నాగవంశీ నిర్మిస్తున్నారు. మరి ఈ లవ్లీ సాంగ్ ఎలా ఉండబోతుందో తెలియాలంటే శనివారం వరకు వేచి చూడాల్సిందే. శరవేగంగా చిత్రీకరణ పూర్తి చేసుకుని ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ‘రంగ్ దే’.